JAISW News Telugu

DK Shivakumar : ఆదాయానికి మించి ఆస్తుల కేసు.. డీకే శివకుమార్ కు ‘సుప్రీం’లో ఎదురుదెబ్బ

DK Shivakumar

DK Shivakumar

DK Shivakumar: ఆదాయానికి మించిన ఆస్తలు కేసును ఎదర్కొంటున్న కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు సుప్రీం కర్టులో చుక్కెదురైంది. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డీకే శివకుమార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. ఇప్పటికే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయని, దీనిపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

2013-18 కాలంలో కాంగ్రెస్ కర్ణాటకలో పాలన సాగించగా, అప్పట్లో డీకే శివకుమార్ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో డీకే శివకుమార్ తన ఆదాయంలో రూ.74 కోట్లకు పైగా ఆదాయానికి లెక్కలు చూపించలేక పోయారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో డీకేపై వచ్చిన ఆరోపణలతో ఐటీ శాఖ దాడులు కూడా చేసింది. అనంతరం మనీలాండడరింగ్ అంశాలపై ఈడీ దర్యాప్తు చేయగా, ఈడీ దర్యాప్తును ఆధారంగా చేసుకుని సీబీఐ కేసు నమోదు చేసింది.

దీంతో, డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. డీకే పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టులోనూ ఆయనకు నిరాశ తప్పలేదు.

Exit mobile version