JAISW News Telugu

KTR : కేటీఆర్‌పై కేసు.. తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ కేడర్..

 KTR

KTR

KTR : అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న బీఆర్ఎస్ కు పుండుపై కారంలా.. దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతినడం. గెలిచిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి వలసలువెళ్లడం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పార్టీ నేత, కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం, ఇక ఇప్పుడు కేటీఆర్ పై కేసు నమోదు కావడం.

లిక్కర్ కేసులో పార్టీకి వచ్చిన అపవాదును సాకుగా చూపి పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. వరుసగా గుడ్ బై చెప్తున్నారు. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెడుతున్న అభ్యర్థులు కూడా పోటీ నుంచి తప్పుకుంటూ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీనికి తోడు ఇప్పడు కేటీఆర్ పై వరుసగా కేసులు రిజిస్ట్రర్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్‌ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

రీసెంట్ గా (మార్చి 30) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై మరో కేసు నమోదైంది. బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 504,505(2) కింద కేసు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేశారని’ కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ ఆరోపణలను తిప్పికొట్టారు. దీంతో పాటు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు కారు పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

Exit mobile version