అలాంటి ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఓ మహిళ(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు ఆమె ఆరోపించింది. ఫిర్యాదు తీసుకున్న రాయ దుర్గం పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన ఇంట్లో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసును బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల ఆయన తిరు చిత్రానికి గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. జనసేనకు ఎన్నికల్లో స్ట్రాంగ్ సపోర్టర్ గా నిలిచారు. పవన్ అంటే తనకు ఎంత అభిమానమో.. ఆయన మాటల్ని బట్టి అర్థం అవుతుంటుంది. ఎన్నికల సమయంలో జనసేన తరఫున పార్టీ టికెట్ కూడా ఆశించారు, కానీ పొత్తు ధర్మం వల్ల ఆయనకు టికెట్ దక్కలేదు. అయినా సరే, నిజాయతీగా పార్టీకి సేవ చేశారు. ఓ పాట కూడా జనసేన కోసం రూపొందించారు. వాస్తవానికి జానీ మాస్టర్ పై ఇప్పటి వరకు క్లీన్ ఇమేజ్ ఉంది. తనపై ఎలాంటి కంప్లైట్ ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి బయటకు అయితే రాలేదు. ఒక వేళ జానీ మాస్టర్ కనుక తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఆయనపై కేసు విషయంలో ఏదైనా కుట్ర కోణం ఉందా? ఆయన్ని కావాలని ఇరికించాలని చూస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయట కూడా జానీ చాలా మంచోడని, ఆయన మహిళల పట్ల గౌరవంగా మసులుకొంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయంగానూ ఎదగాలనుకొంటున్న తరుణంలో జానీపై కావాలనే ఇరుకున పడేయాలని ఎవరైనా ప్రయత్నించారా.. అసలు నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేశారా అన్న విషయాలు తేల్చాల్సింది పోలీసులు.. కోర్టులే.