ACP : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించిన ఏసీపీపై కేసు..

ACP

ACP

ACP : మద్యం మత్తులో కారు నడుపుతున్న ఓ వ్యక్తికి రక్షణ కల్పించేందుకు ప్రయత్నించిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిద్దిపేట జిల్లా ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడిన ఒక పోలీస్ ఏసీపీ తనిఖీ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన నవంబర్ 12వ తేదీ రాత్రి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. ఏసీపీ దురుసుగా ప్రవర్తించిన వీడియో బయటకు రావడంతో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏసీపీ సివిల్ డ్రెస్ లో కారులో మరో ముగ్గురితో కలిసి వెళ్తున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పాయింట్ వద్ద పోలీసులు వీరి వాహనాన్ని ఆపారు. చెక్ పోస్ట్ వద్దకు చేరుకునే ముందు కారు నడుపుతున్న వ్యక్తి వెనుక సీటుకు మారడం, మరొకరు డ్రైవింగ్ సీటులోకి రావడాన్ని సమీపంలోని మహిళా కానిస్టేబుల్ గమనించింది. ఇద్దరికీ ఇద్దరికీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసేందుకు వాహనాన్ని ఆపారు. వీరు పోలీసులకు సహకరించలేదు. తను ఏసీపీనని నాకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయద్దని తనను పంపించాలని పట్టుబట్టాడు.

చెక్ పాయింట్ ఇన్ చార్జి ఎస్ఐ కాంతారావు తమకు సహకరించాలని ఏసీపీని కోరారు. అయినా వినకుండా ఏసీపీ వాగ్వాదానికి దిగి సహకరించద్దని సదరు డ్రైవర్ ను కూడా హెచ్చరించాడు. వాగ్వాదంలో ఏసీపీ తనను తోసేసి వాహనం బానెట్ ను కొట్టారని, దీంతో నష్టం వాటిల్లిందని కాంతారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ బ్యాకప్ కోసం పిలవడంతో ఇంటర్సెప్టర్ వాహనం వచ్చి అసలు డ్రైవర్ ను మధురానగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది.

అక్కడ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించారు. బ్లడ్ లో ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) రీడింగ్ 39 మి.గ్రా/1000 మి.లీగా నమోదైంది. ఇది పరిమితికి 30 మి. గ్రా కంటే ఎక్కువ. అతడు అల్వాల్ కు చెందిన వ్యాపారి జైపాల్ రెడ్డిగా గుర్తించారు. మిగతా వారు శ్రీనివాస్, వెంకట్రావు. ఈ ఘటన మొత్తాన్ని కానిస్టేబుల్ కావేరి సెల్ ఫోన్ లో రికార్డ్ చేయగా, కారు చెక్ పాయింట్ వద్దకు రాగానే కారు డ్రైవర్ వెనుక సీటు వైపు వెళ్లడాన్ని గమనించారు. ఎస్ఐ ఫిర్యాదుతో ఏసీపీతో పాటు మరో ముగ్గురిపై బీఎన్ఎస్ లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

TAGS