Vijayawada Airport : రేపటి నుంచి విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు ప్రారంభం
Vijayawada Airport : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. కార్గో సేవలందించే టెండర్లు ఖరారయ్యాయి. ఒమేగా ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అనుమతులు కూడా పొందింది.
ఈ సందర్భంగా విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి శనివారం మాట్లాడారు. రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతోపాటు పూలు, పండ్లు, మిర్చి తదితర ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతానికైనా సరసమైన ధరలలో గంటల వ్యవధిలో చేర్చేందుకు కార్గో సర్వీసు దోహదపడుతుందన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ సర్వీసు నడిపేందుకు కస్టమ్స్ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.
TAGS AAIAirport Director Lakshmikanth ReddyCargo service at Vijayawada AirportCargo ServicesOmega EnterprisesVijayawada Airport