JAISW News Telugu

Bollywood : కెరీర్ చివరి దశకు వచ్చేశా.. బాలీవుడ్ సూపర్  స్టార్ షాకింగ్ కామెంట్స్

Bollywood

Bollywood

Bollywood : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్  స్టార్ గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్య కథలతో, ఎవరూ టచ్ చేయని కథాంశాలను ఎంచుకొని సూపర్ హిట్లు కొట్టాడు ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫె్క్ట్.  బాలీవుడ్ కు వరుసగా 100 కోట్లు, 200 కోట్ల నుంచి మొదలుకొని 2000 కోట్ల  కలెక్షన్లు కొట్టగొట్టి చూపించాడు. దంగల్ సినిమా కలెక్షన్లను ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా అధిగమించలేదు. ఎనిమిదేళ్లుగా ఇప్పటి ఈ రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు. అంత హయ్యెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సూపర్ స్టార్ దారుణమైన డిజాస్టర్లను కూడా మూటగట్టుకున్నాడు. అమిర్ ఖాన్ చివరి చిత్రం లాల్ సింగ్  చద్దా ఈ సూపర్ స్టార్ కెరీర్ లో అత్యంత డిజాస్టర్ గా మిగిలింది.  ఆ తర్వాత మరో సినిమా చేయలేదు అమిర్ ఖాన్.

నిర్మాతగా అమిర్..

ఏడాదికో, రెండేళ్లకో సినిమా చేసే అమిర్… 2022లో లాల్ సింగ్ చద్దాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ తెరమీద కనిపించలేదు. ఇక నిర్మాతగా తన అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించకున్నాడు. ‘కొవిడ్‌ సమయంలో షూటింగ్స్‌ లేక ఖాళీగా ఉన్నప్పుడు ఇక తన కెరీర్ ముగిసిందని భావించాడు.  దాదాపు 35 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు అందుకున్న అమిర్  దేశం తనకెంతో ఇచ్చిందని, ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

తన పర్ఫెక్ష న్ కు ఏడాదికి ఒక సినిమాకు మించి చేయలేడు. కానీ ప్రొడ్యూసర్ గా  మంచి కథలను ప్రేక్షకులకు అందించవచ్చని  నిర్ణయించుకున్నాడు. దీంతో అనుకున్నదే తడవుగా నూతన దర్శకులు, రచయితలు, నటీనటులకు అవకాశం ఇవ్వాలని సంకల్పించాడు. దీంతో తన తొలి  ప్రయత్నంగా ‘లాపతా లేడీస్‌’ లాంటి సినిమాను  నిర్మించేందుకు వచ్చాడు. ఇక ముందు ఏడాదికి ఐదారు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నట్లు చెబుతున్నాడు.

కిరణ్‌రావ్‌ దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్‌ నిర్మించిన సినిమా  ‘లాపతా లేడీస్‌. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటనను నేపథ్యంగా ఎంచుకొని సినిమాగా మలిచారు. లింగ సమానత్వాన్ని చాటిచెప్పే ఈ మూవీ ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఓటీటీలో మంచి ఆదరణ పొందతున్నది. ఈ సినిమా విడుదలకు ముందుగానే గత సెప్టెంబరు 8న  ప్రతిష్టాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ప్రదర్శించారు. ఈ వినోదాత్మక చిత్రంలో నితాన్షీ గోయల్‌, ప్రతిభా రంతా, స్పర్శ్‌ శ్రీవాస్తవ, ఛాయా కదమ్‌, రవికిషన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 9న ఈ సినిమాను సుప్రీం కోర్టులో ప్రదర్శించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తో పాటు సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు అంతా కలిసి తిలకించారు.

Exit mobile version