cakes : పుట్టినరోజు, పండగ రోజు, పెళ్లి రోజు ఇలా ఏ పండుగ వచ్చినా కూడా కేకు ఆర్డర్ పెట్టుకోవడం దానిని కోయడం దాన్ని ఇష్టంగా తినడం అందరికీ అలవాటైపోయింది. అయితే కేకుల్లో కలిపే రంగులు వాడే పదార్థాలు హానికరమైనవని వాటి ద్వారా మనుషులకు క్యాన్సర్ వస్తుందని బెంగళూరులోని ఆహార భద్రతా నాణ్యతా మండలి తేల్చింది.
బెంగుళూరులో దాదాపు 235 బేకరీలో కేకులను పరీక్షించిన ఆహార భద్రత మండలి అందులో కలిపే కలర్స్ లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కేకులు తినడం వలన మనిషికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చింది. దీంతో అందరూ ఒక్కసారి గా
షాకయ్యారు.
అలాగే అందరూ ఎక్కువగా ఇష్టపడే బ్లాక్ ఫారెస్ట్ , రేట్ వెల్వెట్ అనే కేకుల్లో ఎక్కువగా క్యాన్సర్ కారకాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. దీనితో ఒక్కసారి కేకులను ఇష్టపడే వారికి దిమ్మతిరిగిపోయినట్లుంది. ప్రతి బర్త్డే పార్టీలో కేకును ఇష్టంగా తినడం చాలా మందికి అలవాటైపోయింది. దాన్ని తినడమే కాకుండా ముఖానికి పూసుకోవడం కళ్లు ముక్కులోకి వెళ్లడం కూడా జరుగుతుంది. ఇలా క్యాన్సర్ కారకమైన వాటిని ఇన్ని రోజులు తిన్నామా అని చాలామంది బాధపడుతున్నారు.
ఏది తినాలో ఏది తినకూడదు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పండుగ చేసుకొని కేక్ కట్ చేసుకుని తిందామా అని ఇప్పటి నుండి భయపడే పరిస్థితి తలెత్తింది. ప్రపంచంలో గతంలో ఎయిడ్స్ వ్యాధి ఎంత బెంబేలెత్తించిందో ప్రస్తుతం క్యాన్సర్ కూడా ఇండియా లో విపరీతంగా వ్యాపిస్తుంది.
ఇది చాలా దారుణమైన వ్యాధి కావడంతో అందరు భయపడిపోతున్నారు. కేకుల్లో క్యాన్సర్ కారక పదార్థాలు వాడకుండా తయారు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. కేకు తినేవారు ఇష్టంగా పండుగ చేసుకుంటారని అలాంటి కేకుల్లోనే క్యాన్సర్ కారకాలు కలిపే కలర్స్ వాడడం ఎంతవరకు సబబుని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కర్ణాటకలోని బెంగళూరు పోలీసులు కూడా స్పందించారు. పలు బేకరీలపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.