Jr NTR : తాత పేరు చెడగొట్టలేను… జూనియర్ ఎన్టీఆర్
Jr NTR : సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీకి అగ్ర నటుడు. తెలుగులో సినిమా రంగంలోనే అతి పెద్ద కథా నాయకుడు.. ఆయన తర్వాతనే వేరే ఎవరైనా.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాతాళ బైరవి, మాయాబజార్ సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అంతలా అలరించాయి. అలాంటి సినిమాలను రీమేక్ చేయడానికి ఇప్పటికీ ఏ దర్శకులు, నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు.
1951 లో విడుదలైన పాతాళ బైరవి మూవీలో సీనియర్ ఎన్టీఆర్ మూవీ తెలుగు సినిమా రంగాన్ని ఒక లెవల్ కు తీసుకెళ్లింది. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, సావిత్రి, రేలంగి వెంకట్రామయ్య, గిరిజ, మాలతి లాంటి అగ్రశ్రేణి నటులు తమ నటన కౌశాలన్ని ప్రదర్శించారు. దీంతో తెలుగులోనే ఆ సినిమా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా పాతాళ బైరవి, మాయాబజార్ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని చెప్పేవాడు. అయితే పాతాళ బైరవి పోస్టర్ లో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ .. ప్రస్తుతం దేవరలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ ఒకే పోలికతో కలిగి ఉండడంతో ఫ్యాన్స్ ఖుసీ అయిపోతున్నారు. .
జూనియర్ ఎన్టీఆర్ నటన, ముఖం అంత అచ్చం తాత పోలికలతో ఉండటంతో అందరూ జూనియర్ ఎన్టీఆర్ పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. తాత వారసత్వాన్ని అందిపుచ్చుకునే అర్హత జూనియర్ కే ఉందని ఇప్పటికీ అంటుంటారు. అయితే ఒకానొక సందర్భంలో తాత నటించిన చిత్రాల్లో ఏ చిత్రం నీకు బాగా నచ్చుతుంది. ఏ చిత్రాన్ని మళ్లీ చేస్తే అందులో మీరు సరిపోతారని ప్రశ్నించారు.
తాత నటించిన చిత్రాల్లో పాతాళ బైరవి, మాయాబజార్ చిత్రాలు ఎంతో ఇష్టమని చెప్పాడు. అలాంటి చిత్రాలను మళ్లీ ఎప్పటికీ తీయలేరు. ఒక వేళ తీయాలని చూసిన అలాంటి నటన, హవాభావాలు చేయగల సత్తా మనకు లేదు. నిజంగా చెప్పాలంటే ఆ చిత్రానికి ఉన్న గొప్ప పేరును అందులోని నటన చేయడంలో మనం చేరుకోలేమని చెప్పాడు. అలాంటి సినిమాలు చేసి తాత పేరు చెడగొట్టాలని లేదు. అంత గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు చూపిన చొరవ ఇప్పటి తరంతో సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది కూడా నిజానికి వాస్తవమే. ప్రస్తుతం టెక్నాలజీ ఎంత మెరుగైన మాయాబజార్, పాతాళ బైరవి లాంటి సినిమాలు తెలుగులో రీమేక్ చేయడానికి ఇంకా భయపడుతూనే ఉన్నారు.