JAISW News Telugu

Canara Bank : కెనరా బ్యాంక్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్

Canara Bank

Canara Bank

Canara Bank : కెనరా బ్యాంక్ ‘ఎక్స్’ హ్యాండిల్ హ్యాక్ అయింది. దీంతో ఒక్కసారిగా బ్యాంక్ అధికారులు, యూజర్లు ఆందోళనకు గురయ్యారు. ఇటీవల యాక్సెస్ బ్యాంక్ అధికారిక ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ మరువకముందే మరో బ్యాంక్ ఖాతాపై సైబర్ దాడి జరిగింది. తాజాగా కెనరా బ్యాంక్ సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయింది. అధికారిక అకౌంట్ జాలై 22న హ్యాక్ కు గురైంది. ఒక్కసారిగా హ్యాండిల్ యూజర్ నేమ్ మారిపోవడంతో వినియోగదారులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే దీనిపై బ్యాంక్ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

కొద్ది రోజుల క్రితమే యాక్సెస్ బ్యాంక్ పై కూడా ఇలాంటి సైబర్ దాడి జరిగింది. సంబంధిత ఎక్స్ హ్యాండిల్ లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమవ్వడంతో అకౌంట్ హ్యాక్ అయిందని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

Exit mobile version