Canada Vs Ireland : కెనడా, ఐర్లాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కెనడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కెనడా.. శ్రేయస్ మొవ్వా (37) , కిర్టన్ (49) పరుగులతో రాణించగా.. నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. కెనడా ఓపెనర్లు శుభారంభం ఇవ్వకపోయిన మిడిలార్డర్ బ్యాట్స్ మెన్స్ అయినా శ్రేయస్ మొవ్వా, కిర్టన్ ఐరిష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కెనడా నవనీత్ దలివల్ 12 పరుగులకే వెనుదిరగగా.. 28 పరుగులకు కెనడా రెండో వికెట్ కోల్పోయింది.
వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా కిర్టన్, శ్రేయస్ మొవ్వా పార్ట్ నర్ షిప్ తో 137/7 తో ఇన్సింగ్స్ ముగించింది. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్, మెకార్టీ రెండే సి వికెట్లు తీయగా.. అడైర్, డిలెనీ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం ఛేదనకు దిగిన ఐర్లాండ్ బ్యాట్స్ మెన్స్ కెనడా బౌలర్ల దాటికి 59 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.
ఐరిష్ ఓపెనర్లు 26 పరుగుల భాగస్వామ్యానికి తెర దించుతూ.. జెరీమీ గోర్డాన్ ఐరిష్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ను పెవిలియన్ కు చేర్చాడు. అనంతరం టాప్ 5 బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేక 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. మార్క అడైర్ 34 పరుగులు, డాక్ రెల్ 30 పరుగులతో చేజ్ చేసేలా కనిపించారు.
ఆరు బంతుల్లో 17 పరుగులు కావాల్సిన సమయంలో కెనడా బౌలర్ గోర్దాన్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. దీంతో కెనడా మొదటి సారి వరల్డ్ కప్ టీ 20 లో తన కన్న బలమైన ప్రత్యర్థి అయిన ఐర్లాండ్ పై ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ దీంతో రెండు మ్యాచులు ఓడిపోగా సూపర్ సిక్స్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. గ్రూపు ఏ లో కెనడా, ఇండియా చెరో విజయం సాధించగా.. అమెరికా రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్స్ టేబుల్స్ లో టాప్ లో ఉంది.