Canada : అమెరికా కంటే కెనడానే నయం.. అటు వైపే మొగ్గుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?
Canada : 8 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అపరిమిత గంటలు పనిచేసే అవకాశం కల్పిస్తూ కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆ దేశ జాబ్ మార్కెట్, యువత నిరుద్యోగంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందని ఆ దేశ ఆర్థిక సామాజికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
యాక్సెస్-టు-ఇన్ఫర్మేషన్ రికార్డుల ప్రకారం కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్, సిటిజన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. కెనడా అంతటా ఉన్న కార్మికుల కొరతను ఆయన ప్రస్తావిస్తూ విదేశీ విద్యార్థులను స్థానిక కార్మికులకు అపరిమిత పని గంటలు కల్పిస్తూ వారిని ఎక్కడికి పంపించడం లేదని అన్నారు.
8 లక్షల 7 వేల మంది విదేశీ విద్యార్థుల్లో 80 శాతం మంది అంటే సుమారు 6 లక్షల 46 వేల మంది ఇప్పటికే మునుపటి 20 గంటల పని పరిమితిని దాటుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో కార్మికుల కొరత నేపథ్యంలో విద్యార్థులపై ఆర్థిక భారాలను తగ్గించే విధానాల ఆవశ్యకతను మిల్లర్ మరోసారి నొక్కి చెప్పారు.
దీనికి విరుద్ధంగా, వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు పాఠశాల సెషన్లలో వారానికి 20 గంటలు, విరామ సమయంలో పూర్తి సమయం క్యాంపస్ పనిలో పాల్గొనడానికి యునైటెడ్ స్టేట్స్ అనుమతిని ఇస్తుంది.
కెనడా ఇప్పుడు అపరిమిత పని గంటల అవకాశాన్ని విస్తరించడంతో, విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారత్ కు చెందిన వారు, ఉపాధి అవకాశాలలో కొత్తగా కనుగొన్న సౌలభ్యం కారణంగా తమ చదువుల కోసం అమెరికా కంటే కెనడాను ఎంచుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు.