Medaram Jatara 2024 : మేడారం జాతర ఈనెలలోనే వస్తోంది. దీంతో అన్ని దారులు మేడారం వైపే వెళ్తుంటాయి. ఈ సారి మహిళలకు టికెట్ లేకపోవడతో భక్తులు తండోపతండాలుగా రానున్నారని చెబుతున్నారు. వనదేవతలను సందర్శించి మొక్కులు చెల్లించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో భక్త జన కోలాహలం పెరగనుందని అంటున్నారు.
సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఒక వైపు ప్రభుత్వం చెబుతున్నా అక్కడ క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భక్తులు విడిది చేసే ప్రాంతాల్లో కనీసం వీధి దీపాలు కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భక్తులు స్నానాలకు వెళ్లే జంపన్నవాగు వద్ద శుభ్రమైన నీరు అందుబాటులో లేదు. నీరంతా మురికిగా ఉంది. దీంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు కూడా వారిని కష్టాలకు గురిచేస్తున్నాయి. జంతు వ్యర్థాలను ఎక్కడికక్కడే పడేస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తోంది. ఎటు చూసినా దుర్గంధం వ్యాపిస్తోంది.
ముసలివారికి, పిల్లలకు వీఐపీ దర్శనం ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా భక్తులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నారు. భక్తులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయడంలో విఫలం య్యారని ఆరోపిస్తున్నారు. అక్కడకు వెళ్తే మీరు ఎదుర్కొనే సమస్యలను కూడా ఏకరువు పెట్టి సమస్యలపరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.