Toll Gate Problems : టోల్ గేట్ సమస్యలకు ఇక చెక్ పెట్టొచ్చా?
Toll Gate Problems : ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. అందులో మన జనాభా కూడా విపరీతంగా ఎక్కువవుతోంది. ఇప్పుడు ప్రపంచంలోనే మన జనాభా ఎక్కువ. రెండో స్థానానికి చైనా పడిపోయింది. అంతలా జనాభా పెరిగిపోవడంతో అన్నింట్లో పోటీ నెలకొంది. ఈనేపథ్యంలో ఎటు చూసినా జనాలే కనిపిస్తున్నారు. రోడ్లన్ని రద్దీగా మారుతున్నాయి. దీని వల్ల మనకు కష్టాలు కూడా ఏర్పడుతున్నాయి.
ప్రస్తుతం టోల్ గేట్లు ఎటు వైపు పోయినా కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ తీసుకొచ్చారు. దీని వల్ల కూడా కొంత ఆలస్యం జరిగింది. పండగల వేళ ఇళ్లకు వెళ్లాలనుకునే వారికి టోల్ గేట్ల వద్ద గంటల కొద్ది ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో కలిగిన అసౌకర్యానికి వేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వం ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద ఆగకుండా వెళ్లేందుకు సరికొత్త ఫార్ములా తీసుకొచ్చింది. జీపీఎస్ విధానంతో మనం టోల్ గేట్ వరకు వెళ్లగానే మన డబ్బులు నేరుగా కట్ అవుతాయి. దీంతో మనం ఆగాల్సిన అవసరం ఉండదు. ఫాస్ట్ గా వెళ్లొచ్చు. ఇలా కొత్త కొత్త విధానాల ద్వారా మనవారు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రయాణికులకు మేలు చేస్తున్నాయి.
టోల్ గేట్ల వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా వెళ్లే విధానం వల్ల ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది. క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రయాణాల్లో పడే కష్టాలకు ఇక చెక్ పెట్టొచ్చు. ప్రభుత్వం తీసుకునే చర్యలు మనకు మంచి ప్రయోజనాలే కలిగించనున్నాయి. ఇలా మన టోల్ గేట్ సమస్యల నుంచి బయట పడొచ్చని భావిస్తున్నారు.