JAISW News Telugu

Sharmila : షర్మిల ఐదేళ్లు నిలబడగలదా..?

Sharmila

Sharmila

Sharmila : చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ సుదీర్ఘ కాలంగా రాజకీయాలను తట్టుకొంటూ నిలబడి రాణించారు. కనుక వారి స్ఫూర్తితోనే ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల కూడా నిలబడాలని ఆశిస్తున్నట్లు ఆమెను చూస్తే అర్థం అవుతుంది. అందుకే ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ ఇమేజ్‌ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీని ద్వారా కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి వెళ్లిన నాయకులను ఆకర్షించాలనేది ఆమె వ్యూహం పన్నింది.

ఆమె చేస్తున్న ప్రయత్నాలు, వాటి పర్యవసనాల గురించి అన్న జగన్ కు బాగా తెలుసు. కాబట్టి ఆయన కూడా పార్టీని కాపాడుకునేందుకు  ప్రయత్నించవచ్చు లేదా తన పలుకుబడి, పరిచయాలను ఉపయోగించి ఆ పదవిలో నుంచి తప్పించేందుకు ప్రయత్నించవచ్చు. కనుక ఈ విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయాలు అనివార్యంగానే కనిపిస్తున్నాయి.

వైఎస్ షర్మిల టీడీపీ సూపర్ సిక్స్ హామీల గురించి, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీ గురించి ప్రశ్నిస్తుండడం చూస్తే రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు ‘రోటీన్ రాజకీయాల’పై కూడా ఆమె దృష్టి పెట్టిన్నట్లే భావించవచ్చు.

కానీ ఏపీ కాంగ్రెస్‌లో ఆమె కంటే హేమాహేమీలు ఉన్నప్పటికీ ఆమె ఒక్కరి గొంతే వినిపిస్తుండడం గమనిస్తే పార్టీలో ఆమె ఏకాకిగా ఉన్నట్లు అర్థం అవుతోంది. కనుక ఆమె వైసీపీలో సీనియర్ నేతలను ఆకర్షించగలరా? లేదా? అనే దానిపై ఆమె రాజకీయ భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. అప్పుడే ఆమె రాబోయే ఐదేళ్లపాటు రాజకీయాల్లో నిలబడగలదా లేదా? అనేది తెలుస్తుంది.

Exit mobile version