JAISW News Telugu

Yoga : గర్భిణీ స్త్రీలు యోగా చేయొచ్చా.. చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ.

Yoga

Yoga

Yoga : యోగా సాధన వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. యోగా అంటే కేవలం శరీరానికి వ్యాయామం చేయడమే కాదని మనసు, శ్వాస మీద ధ్యాస ఉంచడం కూడా ఒక విధానం అని తెలుపుతుంది. ముఖ్యంగా మనిషిలో కలిగే అనవసర భావనల్ని దూరం చేస్తుంది. గర్భిణులు, యోగా చేయడం మంచిది కాదని చెబుతుంటారు.  

14 వారాల తర్వాత యోగా చేయడం  వల్ల గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగమని చెబుతున్నారు. చాలా మందిలో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.  అలాంటి సమస్య ఉన్న వారు యోగా చేస్తే హానికరం అని చాలా మంది అంటుంటారు. కానీ సైంటిఫిక్ గా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి ఆధారాలు లేవు. అయితే యోగా చేయాలనుకునే గర్భిణీలు ముందుగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

గర్భిణీ స్త్రీలు పశ్చిమోత్తాసనం, ఊర్ధ్వ ఉత్తానాసనం, మార్జారియాసనం, విరాసనం, ఉష్ట్రాసనం, సుఖాసనం, వీరభద్రాసనం, ఉత్తానాసనం,  మొదలైనవి చేయవచ్చు.  ఇవి చేయడం వల్ల  గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి ప్రినేటల్ యోగా సహాయపడటమే కాకుండా..  నిద్రను చాలా మెరుగు పరుస్తుంది.  ఒత్తిడి, ఆందోళన తగ్గించి ప్రసవానికి అవసరమైన కండరాల బలాన్ని కూడా పెంచుతుంది. వెన్నునొప్పి, వికారం, తలనొప్పి, శ్వాస ఇలా అనేక రకాల సమస్యల్ని తగ్గిస్తుంది.

యోగా చేసే సమయంలో వేగంగా చేయాలనుకోవడం తొందరగా ముగించుకోవాలనే తాపత్రయంలో స్పీడ్ గా చేస్తే మొదటికే మోసం వస్తుంది. అందుకే యోగాసనాలు వేసే సమయంలో తీరిగ్గా, జాగ్రత్తగా చేయాలి. దాదాపు యోగా చాలా మంది ఉదయాన్నే చేస్తారు. ఉదయం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు మాత్రం యోగాను ప్రముఖ నిపుణుల వద్దే నేర్చుకుని చేయాలి. యూ ట్యూబ్ లలో, సోషల్ మీడియాలో చూసి చేస్తే మాత్రం నష్టపోతారు. అలాంటి ప్రయోగాలు అస్సలు చేయకూడదని అనుకుంటున్నారు. ప్రయోగాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు

Exit mobile version