Bigg Boss : ఇంత ఒత్తిడిలో నాగ్ బిగ్ బాస్ ను హ్యాండిల్ చేయగలడా..?
Bigg Boss : కింగ్ నాగార్జున అక్కినేని తన N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తాను సెంటు భూమిని కూడా ఆక్రమించలేదని, కోర్టులు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని చెబుతూ అందరూ అపోహలకు వెళ్లొద్దని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో విజ్ఞప్తి చేశారు. కోట్లాది రూపాయల విలువైన ప్రాపర్టీని హైడ్రా గంటల్లో కూల్చివేసింది. ఈ నేపథ్యంలో ఆయన కొంచెం డిప్రెషన్ లో ఉన్నట్లు వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. ఏడు సీజన్లను జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన కింగ్ నాగార్జున ఈ సీజన్ ను కూడా విజయవంతంగా హ్యాండిల్ చేయగలడా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, సీజన్ 6 భారీగా ఫ్లాప్ ఎదుర్కొన్న నేపథ్యంలో సీజన్ 7కు నాగార్జున హోస్ట్ గా ఉండరని వాదనలు వినిపించాయి. కానీ వాటిని పక్కకు నెడుతూ ఆ సీజన్ ను సక్సెస్ చేశారు. చివరలో పల్లవి ప్రశాంత్ పై కేసు తదితర కారణాలతో బిగ్ బాస్ ప్రతిష్టకు కొంచెం భంగం వాటిళ్లినా నాగార్జునపై మాత్రం ఎలాంటి మచ్చ పడలేదు.
అయితే ఇప్పుడు N కన్వెన్షన్ కూల్చివేత మూడ్ లో ఉన్నారు నాగార్జున ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన షో బిగ్ బాస్ సీజన్ 8ని ఆయన సమర్థవంతంగా హోస్ట్ చేయగలరా అనేది పెద్ద ప్రశ్న. ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించేందుకు హాట్ స్టార్ తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ పాత్ర కమాండ్ అండ్ కంట్రోల్ చూపించడం, అలాగే పార్టిసిపెంట్స్ చేసే తప్పులపై ఉపన్యాసాలు ఇవ్వడం చేయాలి.
నాగార్జునకు ఈ షో కొత్త కాకపోయినా ఈ సీజన్ మాత్రం పెద్ద ఛాలెంజ్ కానుంది. ప్రస్తుతం కొనసాగుతున్న వివాదం తన నటనను ప్రభావితం చేయకుండా షోను నడిపించాలి. ఈసారి షోలో ఆయన ప్రతి కదలికపై తీవ్ర పరిశీలన ఉండడంతో అందరి దృష్టి ఆయన ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ పైనే ఉంటుంది. మరి ఈ ఒత్తిడిని నాగ్ ఎలా తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆయన కష్టపడతాడా అనేది త్వరలోనే తేలిపోనుంది.