Lokesh : ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరంలో అమెరికా, ఇతర దేశాలకు చెందిన సంభావ్య పెట్టుబడిదారులతో సమావేశమై పెట్టుబడుల నుంచి ఇటీవలి ఏపీలో వచ్చిన వరదల వరకు వివిధ అంశాలపై చర్చించారు.
లోకేశ్ లో ముఖ్యంగా గమనించాల్సిన విషయం విషయం ఏంటంటే ఆయన ఎప్పుడూ విలక్షణ రాజకీయ నాయకుడిగా కనిపించరు. కానీ ఆయన సాధించే ఫీట్స్ మాత్రం చరిత్రలో నమోదు చేసేలా ఉంటాయి. యువగళంను తీసుకోండి. ఏ లోకేశ్ తో ఏమవుతుందిలే అనుకున్నారు. కానీ రాష్ట్రాన్ని ప్రభుత్వంలోకి తెచ్చింది. మంగళగిరిలో టీడీపీ గెలిచిన చరిత్ర లేదు. పట్టుబట్టి ఆయన అక్కడి నుంచి నిలబడి విజయం సాధించి చూపించాడు. సాధారణ రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా ఎక్ట్రీమ్ గా వ్వహరించడమే నారా లోకేశ్ స్పెషల్.
చంద్రబాబు తనయుడు అని ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయన సమర్థుడు అని మొత్తం పార్టీ నాయకులు నమ్మారు కాబట్టి ఇచ్చారు. లోకేశ్ ను గతంలో కొందరు సొంత పార్టీ నాయకులతో పాటు వైసీపీ పప్పుగా చెప్పేది. కానీ ఆయన ఒక కెరటం అని నిరూపించుకున్నారు. ఇక ఆయన చక్కటి ఇంగ్లిష్ లో మాట్లాడుతారు. పాశ్చాత్య విద్యాభ్యాసమే ఆయనకు దోహదపడింది.
పరిశ్రమల స్థాపనకు ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలను అందజేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ (ఏపీ) వ్యాపారాలకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని, దీంతో పాటు ఏపీ గొప్ప భౌగోళిక ప్రయోజనాలను కలిగి ఉందని నారా లోకేశ్ సమ్మిట్ లో వివరించారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ.. న్యూఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్-ఇండియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రసంగించిన లోకేష్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రైవేట్ రంగం సహకారంతో, చురుకైన విధానాలతో సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌ల ప్రోత్సాహానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఆర్థికాభివృద్ధి బోర్డుకు యువ ఐఏఎస్ అధికారి నేతృత్వం వహించేందుకు యువ ఐఏఎస్ అధికారిని తీసుకొచ్చానని, ఈ బృందం ప్రైవేటు రంగానికి చెందినదని, వ్యాపారం చేయడంలో ‘వేగం’ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న అనుభవజ్ఞులు ఉన్నారని లోకేశ్ హామీ ఇచ్చారు.
లోకేశ్ స్పీచ్ చూసిన ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది ఏంటంటే మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీచ్. చెప్పుకునేందుకు కాదు.. వినేందుకు కూడా ఏపీ మాజీ సీఎం జగన్ స్పీచ్ బాగుండదని టాక్. తెలుగులో అచ్చు తప్పులు, బండ బూతులతో రాష్ట్ర పరువు పోయేలా మాట్లాడే జగన్, ఇక ఇంగ్లిష్ మాట్లాడితే అంతే సంగతులు.. అప్పుడు పప్పు అంటూ నిందించిన లోకేశ్ ను చూసి నేర్చుకోవాలి అంటూ తెలుగు ప్రజలు సూచనలు చేస్తున్నారు.
లోకేశ్ వీడియో బైట్స్ కింద చూడండి.