Viral Cricket : క్రికెట్ అంటే ఇలా కూడా ఆడొచ్చా?

Viral Cricket video
Viral Cricket : భారతదేశంలో క్రికెట్ కున్న క్రేజీ ఎలాంటిదో తెలుసు. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే దేశం మనది. దీంతో క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు టీవీలకు అతుక్కుపోవడం సహజం. క్రికెట్ ఆటకు మనం ఇచ్చే విలువ అలాంటిది మరి. ఆట అందరు ఆడతారు. కానీ వెరైటీగా ఆడేవారిదే పైచేయి అవుతుంది. క్రికెట్ దిగ్గజాలుగా మారిన వారు కూడా ఆటలో మెలకువలు నేర్చుకోవాలంటే రోజు ఆడాల్సిందే.
క్రికెట్ ఆడే వారు మామూలుగా మైదాన ప్రాంతాలు ఎంచుకుంటారు. చదునుగా ఉన్న స్థలంలో ఆట బాగుంటుందని అనుకుంటారు. కొందరు గల్లీల్లో ఆడితే మరికొందరు గ్రౌండ్లలోనే ఆడుతుంటారు. ఇక్కడ వీరు మాత్రం వినూత్నంగా క్రికెట్ ఆడుతున్నారు. కొండ మీద బాల్ కొడితే కింద ఫీల్డింగ్ చేస్తున్నారు. దీంతో క్రికెట్ చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఇలాంటి ఆట ఎప్పుడు చూడలేదని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఆట వైరల్ గా మారుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. కొండల్లో క్రికెట్ ఆడటం చూడొచ్చు. క్రికెట్ మీద ఉన్న పిచ్చి అంటే ఏంటో ఈ మ్యాచ్ తెలియజేస్తోంది. ఇలాంటి క్రికెట్ కూడా ఉంటుందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.
కొండ మీద క్రికెట్ ఆడుతూ కింద ఫీల్డింగ్ చేసే సన్నివేశాలు చూస్తుంటే ఆశ్చర్యం వేయక మానదు. ఆనంద్ మహేంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే దీన్ని 14 లక్షల మంది వీక్షించారు. ఇలా క్రికెట్ వెరైగా ఆడుతుంటే అందరికి ముచ్చటేస్తోంది. క్రికెట్ అంటే మజా వస్తోందని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.
India takes cricket to another level.
Or should I say many ‘levels’….
👍🏽🙁 pic.twitter.com/Lhv8BIzw74— anand mahindra (@anandmahindra) January 24, 2024