Siddipet News : కల్లు తాగేందుకు వచ్చి ఆ పని చేశాడు.. వీడు మగాడ్రా బుజ్జీ..!
Siddipet News : జల్సాలకు అలవాటు పడుతూ అప్పులు చేస్తూ.. చేసిన అప్పులు తీర్చలేక దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. లోన్ యాప్ ల నుంచి అప్పుడు తీసుకోవడం.. అవి కట్టాలని ఒత్తిడి చేస్తే దోపిడీలకు దిగడం ఇదే ఇప్పుడు మా కర్తవ్యం అంటున్నట్లు చేస్తున్నారు. నేరాలకు ఎలా పాల్పడాలి అనే విషయాలను నేర్పించేందుకు సోషల్ మీడియా ఉండనే ఉంది. ఇక్కడ ఒక యువకుడు చేసిన పని ఆశ్చర్యానికి గురి చేసింది.
యూ ట్యూబ్ చూసి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఒక యువకుడు సీసీ టీవీ ఆధారంగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నేరం చేయడం అయితే ప్రాక్టీస్ చేశాడు కానీ.. చట్టం కళ్లు మాత్రం కప్పడం చేయలేదు. దీంతో అతన్ని పోలీసులు పట్టుకొని కటకటాల వెనక్కు పంపారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సిద్దిపేట జిల్లా, అక్బర్‌పేట మండలం, భూంపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని కమాన్ వద్ద ఏనగుర్తి గ్రామానికి చెందిన యాదమ్మ అనే మూడేళ్లుగా కల్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. యాదమ్మ ఒంటరిగా ఉంటుందని గ్రహించిన సదరు నిందితుడు కల్లు కొనేందుకు ఆమె వద్దకు వచ్చాడు.
కల్లు కొన్నాడు తాగేశాడు తిరిగి వెళ్తుండగా ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్న భూంపల్లి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. దుబ్బాక, భూంపల్లి పోలీసులు రెండు టీములుగా విడిపోయి నిందితుడి కోసం గాలించారు. నిందితుడు రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన లవణ్ కుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తానే నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు.
నేరం ఎందుకు చేశావని సీఐ శ్రీనివాస్ ప్రశ్నించగా.. లోన్ యాప్ ల ద్వారా తీసుకున్న అప్పులు ఎక్కువ అవడంతో వాటిని తీర్చలేక యాప్ యాజమాన్యం ఇబ్బందులు తట్టుకోలేక.. యువత పెడదారి పడుతున్నారని చెప్పారు. వాటి జోలికి యువత వెళ్లవద్దని సూచించారు. బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని పోలీసులు చెబుతున్నారు.