Hijra : భర్తను హిజ్రా అని పిలవడం కూడా నేరమే అని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అలా పిలవకూడదని పంజాబ్ హర్యానా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. తాజాగా ఇదే విషయంపైన పంజాబ్, హర్యానా హైకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను అలా పిలవడం క్రూరత్వమే అని తెలిపింది. భర్తను హిజ్రా అని పిలవడం మానసిక వేధింపులకు ప్రేరేపించినట్లు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
కిందిస్థాయి కోర్టు ఇచ్చిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ పంజాబ్ అలాగే హర్యానా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తన భార్య అశ్లీల వీడియోలకు బానిసయిందని కోర్టు ఎదుట భర్త తెలిపాడు. అంతేకాదు తనను శారీరకంగా, బలహీనంగా ఉన్నావంటూ అనేకసార్లు అవమానించిందని తెలిపాడు. ఇక ఈ కేసులో భార్య ప్రతివాదులను తోసిపుచ్చిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను హిజ్రా అని పిలిచి అవమానించడం.. నేరమే అవుతుందని తెలిపింది.