MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు

MLC Jeevan Reddy
MLC Jeevan Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీకి రావాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ నుంచి పిలుపు వచ్చింది. కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జీవన్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలిసి వారితో జీవన్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం.
కాగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం, తనకు సమాచారం లేకుండానే ఇదంతా జరిగిందంటూ టి.జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు. అటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయనను కాంగ్రెస్ నేతలు, మంత్రులు బుజ్జగించారు. జీవన్ రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ సైతం చర్చలు జరుపుతోందని, ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయలుదేరడంపై ప్రాధాన్యత సంతరించుకుంది.