Kaleshwaram : ‘కాళేశ్వరం’పై కాగ్ సంచలన నివేదిక..అదొక తెల్ల ఏనుగు..లక్ష కోట్లు నీళ్లలో పోసినట్టే!
Kaleshwaram : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో గత ప్రభుత్వ విధానాలను దారుణంగా తప్పుబట్టింది. ప్రాజెక్టుపై కాగ్ నివేదికలో ఉన్న అంశాలు కింది విధంగా ఉన్నాయి..
– అస్తవ్యస్తంగా పనులు ప్రారంభించడమే కాదు మహారాష్ట్రలో ముంపు సమస్య తలెత్తిందని ఆరోపించింది.
– డీపీఆర్ లో రూ.63,352 కోట్లు చూపించి రూ.1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచారు.
– ప్రస్తుత నిర్మాణం వరకు 14లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉంది.
– మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చవుతుంది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపెట్టారు.
-ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపించారు.
-కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా రూ.1,019కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.
– ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారు. 15 బ్యాంకులతో 87 వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు.
– బడ్జెటేతర రుణాలపై ప్రభుత్వం ఎక్కువ ఆధారపడి ఉంది. రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసింది.
– ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రతీ ఏడాది 700 కోట్ల నుంచి 14వేల 500 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036లో పూర్తవుతుంది.
– ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది. కానీ ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగింది.
– కాళేశ్వరం ప్రాజెక్టు వడ్డీతో సహా 1,47,427 కోట్లకు పెరిగింది.
-ప్రాణహిత ప్రాజెక్టుకు డీపీఆర్ లేదు. కాళేశ్వరం డీపీఆర్ తయారుచేసిన వ్యాప్కోస్ పనితీరులో లోపాలు ఉన్నాయి. రీ ఇంజినీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారు.
తొలుత రెండు టీఎంసీ ఎత్తిపోతలు ప్రతిపాదించి అవసరం లేకున్నా 3 టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని చెప్పింది. దీంతో 28వేల 151 కోట్ల అదనపు వ్యయం ఏర్పడిందని చెప్పింది. కాళేశ్వరం నిర్వహణకు 10 వేల కోట్లు అవసరం పడుతాయని తెలిపింది. కాళేశ్వరంపై ఆదాయం లేదు కాబట్టి రుణాల చెల్లింపు కష్టమని కాగ్ వెల్లడించింది. బడ్జెట్ పై పెను భారం పడుతుందని తెలిపింది. వానాకాలం వచ్చే నీళ్లు వానాకాలంకే సరిపోతాయని యాసంగికి సరిపోవని తేల్చిచెప్పింది.