Telangana budget : తెలంగాణ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో 2024-25కు సంబంధించిన బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ రూ.2 లక్షల 95 వేల కోట్లు ఉంటుందని సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. ఈనెల 26న అసెంబ్లీకి సెలవు, 27న బడ్జెట్ పద్దుపై చర్చ జరగనుంది. 28న ఆదివారం సెలవు ఉంటుంది. 29, 30 తేదీలలో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్య వినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.