Button Politics : ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలకు సంబంధించం నిధులను ఎట్టి పరిస్థితుల్లోనే విడుదల చేయారైందంటూ ఏపీ రాష్ట్ర హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు మంజారు చేసి బటన్ నొక్కి ఓటర్లను అక్కట్టుకుందామనుకున్న వైసీపీ నేతలకు నిరాశే ఎదురైనది. జగన్ వేసిన బటన్ పాచిక పారలేదు. ఎన్నికల తరువాతనే ప్రభుత్వం పథకాలకు చెందిన నిధులు మంజూరు చేసుకోవచ్చని హై కోర్ట్ స్పష్టం చేయడంతో వైసీపీ అధినేత తోపాటు ఆయనను నమ్మొకొని ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు తలపట్టుకోక తప్పలేదు.
గడిచిన ఐదేళ్ల మీ పరిపాలనలో సాధించింది ఏమిటి, చేసిన అభివృద్ధి ఏమిటి అని జగన్ అడిగే సాహసం ఎవరికీ ఉండదు. కానీ ఎన్నికల సమయం కాబట్టి సాహసం చేసి అడుగుతారు. ఆలా అడిగిన వారికి జగన్ సమాధానం ఈ విదంగా ఉంది. బటన్ నొక్కాను పథకాలు అమలు చేశాను అని చెబుతారు. కానీ ఐదేళ్ల కాలంలో ఎన్ని అప్పులు చేశాను. ఎంత దుర్వినియోగం చేశాను. నాయకులు ఎంత అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ఎంతకు తాకట్టుపెట్టాను. తేచి అప్పుల్లో ఎంత దుర్వినియోగం అయ్యింది. ఎంత ఖర్చు చేశాను. ప్రజలపై మోపిన భారం ఎంత. చేసిన అభివృద్ధి ఎంత అనే విషయాలపై మాత్రం సీఎం హోదాలో ఉన్న వైసీపీ నేత జగన్ మాత్రం నోరుమెదపక పోవడం శోచనీయం.
రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజలకు భాద్యుడు. కానీ ఆ బాధ్యతలను మరచిపోయి కేవలం బటన్ నొక్కే ముఖ్యమంత్రిని అని చాటిచెప్పుకోవడం ఆయనకే చెల్లింది. పరిపాలన చివరి దశలో కూడా బటన్ నొక్కి ఓట్లు దండుకోవాలని ప్రయత్నాలు చేసారు. కానీ ఆ ప్రయత్నాలకు ముందుగా ఎన్నికల కమిషన్ తన నిబంధనలు బటన్ నొక్కింది. దాన్ని తట్టుకోలేక వైసీపీ నేతలు కొందరు రాష్ట్ర హై కోర్ట్ కు వెళ్లారు. కోర్ట్ కూడా ఇది సమయం కాదు అంటూ బటన్ నొక్కకుండా అడ్డుపడింది. ఎన్నికల ముందు వైసీపీ నేత జగన్ వేసిన ఎత్తుగడ బోల్తా పడింది. పథకాల నిధులు విడుదల కు సంబందించిన బటన్ నొక్కుదామంటే మూగబోయింది.