Bunny VasuBunny Vasu : ఆగస్టులో భారీ సినిమాల విడుదలకు రంగం సిద్ధమైంది. బాక్సాఫీసును కొల్లగొట్టేందుకు పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఓ వైపు డబుల్ ఇస్మార్ట్, మరో వైపు మిస్టర్ బచ్చన్ సినిమాలు విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. వీటితో పాటు తమిళ చిత్రం తంగలాన్ మూవీ కూడా పోటీలో నిలిచింది. ఇక ఈ పెద్ద సినిమాల మధ్యన ఆయ్ మూవీ కూడా విడుదలకు రెడీ అయ్యింది. బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల డేట్స్ కోసం వేచి చూస్తున్నది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఆగస్టు 15న విడుదల డేట్ ను ఫిక్స్ చేసింది.
అయితే ఆయ్ సినిమాలో నటించిన హీరో ఇప్పటివరకు రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. ఇక కొత్త హీరోయిన్. దర్శకుడూ కొత్తనే. గట్టిపోటీనిచ్చే చిత్రాలు ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతుండగా, ఆయ్ సినిమాకు కేవలం పెద్ద సినిమా నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించడమే ప్లస్ పాయింట్ గా మారింది. అయితే తొలుత ఈ సినిమా ను వాయిదా వేస్తారని అంతా భావించారు. కానీ ఆగస్టు 15నే విడుదలకు చిత్ర యూనిట్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టారు.
ఇక ఆయ్ కు కొన్ని థియేటర్లు గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాస్ నేపథ్యం ఉన్న డబుల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ మూవీలు ఆ వర్గానికి దగ్గరవుతాయి. ఇక పల్లెటూరు నేపథ్యంలో కొనసాగే ఆయ్ కు ప్రత్యేక ఆదరణ దక్కే అవకాశం ఉంది. తంగలాన్ కూడా మాస్ పీపుల్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో సాఫ్ట్ పీపుల్ అంతా ఆయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇదే బన్నీ వాసు తీసుకున్న నిర్ణయానికి కారణంగా తెలుస్తున్నది. ఇక పాటలు, కామెడీ ‘ఆయ్’ కు అదనపు బలంగా నిలిచే అవకాశం ఉంది. మరి ఈ పోటీలో ‘ఆయ్’ చిత్రం నెగ్గుతుందో లేదో చూడాలి.