Pushpa-2 : పుష్ప: ది రూల్’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. రెండు రోజుల క్రితం బన్నీ ట్రిమ్ లుక్ లో కనిపించడంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందనే రూమర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మధ్య గొడవలు జరిగాయని న్యూస్ స్ర్పెడ్ అవుతున్నది. 20 ఏళ్లుగా కొనసాగుతున్న వీరిద్దరి మధ్య రిలేషన్ దెబ్బతిన్నదా అనే అనుమానాలు ఇండస్ర్టీలో వ్యక్తమవుతున్నాయి.
ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తామని పోస్టర్లు సైతం ప్రకటించిన మేకర్స్ ఒక్కసారిగా మరో మూడు నెలలు వాయిదా వేశారు. ఇందుకు ఒక్కో రోజు ఒక్కో కారణం బయటికి వస్తున్నది. ఒకసారి షూటింగ్ పూర్తి కాలేదని, మరోసారి రీషూట్ కు వెళ్తున్నారని, మెగా అభిమానుల ఆగ్రహంతో సుకుమార్-బన్నీల సినిమా వాయిదా పడిందని అనే విషయాలు బయటకు వస్తున్నాయి. దేనిపైనా సినిమా టీమ్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే సినిమా వాయిదా వెనుక షూటింగ్ కు మరింత సమయం కావాలని సుకుమార్ కోరాడని మొన్నటి వరకు గుసగుసలు వినిపించాయి. సినిమా వాయిదా వేసుకున్నా కూడా షూటింగ్ సక్రమంగా జరగడం లేదని, దర్శకుడి తీరుపై బన్నీ కొంత గుర్రుగా ఉన్నారని టాక్.
ఫ్యామిలీతో యూరప్ వెళ్లిన అల్లు అర్జున్..
డైరెక్టర్ సుకుమార్ శైలి నచ్చని బన్నీ తన ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్లారని సమాచారం. యూరప్ వెళ్లారని తెలుస్తున్నది. ఫ్లైట్ జర్నీ సమయంలో కొందరు తీసిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అందులలో బన్నీ తన గడ్డం తీసేసి ట్రిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో సినిమా ఆగిపోయిందనే అనుమానాుల మరింత బలపడుతున్నాయి. అసలు పుష్పరాజ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మాసిన గడ్డాన్ని సవరించుకుంటూ ‘తగ్గేదే లే’ అంటూ చేసిన మానరిజమే అందరికీ గుర్తుకు వస్తుంది. అయితే బన్నీ గడ్డం తీసేస్తే వెంటనే షూటింగ్ చెయ్యడం ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాగా, దీనిపై బన్నీ టీమ్ కూడా స్పష్టత ఇచ్చింది. ‘సుకుమార్ యూస్ కు వెళ్లారని తెలిపింది. బన్నీ హాలీడే వెకేషన్ కోసం యూరప్ వెళ్లారని ప్రకటించింది. అక్కడ వారికున్న వ్యక్తిగత పనుల వల్లే పుష్ప-2 షూటింగ్ నిలిచిందని స్పష్టత నిచ్చింది. బన్నీ-సుకుమార్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని, విడిపోయేంత సమస్యలు వారిద్ది మధ్య లేవని వెల్లడించింది. అయితే డిసెంబర్ 6న సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల అవుతుందని ఓ క్లారిటీ ఇచ్చింది.