Bumrah : బంగ్లాదేశ్ తో టెస్టులకు బూమ్రాకు రెస్ట్.. కొత్త ముఖాలకు చాన్స్?
Bumrah : బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ టెస్టు సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు టెస్టుల సిరీస్‌లో బుమ్రా పునరాగమనం చేస్తాడని తెలుస్తున్నది. భారత జట్టు మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు టెస్ట్ టీమ్‌లో ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమ్, స్వింగ్ బౌలర్‌లను తీసుకుని ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌కు మరింత వైవిధ్యాన్ని జోడించాలనే ఆలోచన చేస్తన్నట్లు తెలుస్తున్నది.
శ్రీలంక పర్యటన నుంచి ఇటీవలే తిరిగి వచ్చిన టీమిండియా దాదాపు నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోనుంది. రోహిత్ శర్మ సేన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లకు సిద్ధం కాబోతున్నది. బంగ్లాదేశ్ జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. బంగ్లాదేశ్ రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. చాలా నెలల తర్వాత టీమిండియా తిరిగి తన గడ్డపై రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతున్నది. కోచ్ గౌతమ్ గంభీర్‌కు స్వదేశంలో తొలి టెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా. ఈ సిరీస్‌ను చిరస్మరణీయంగా మార్చడానికి కోచ్ గా గంభీర్ తనవ వంతు ప్రయత్నాలు చేస్తాడనంలో ఎలాంటి సందేహం లేదు.
బూమ్రా స్థానాన్ని భర్తీ చేసేదెవరూ?
మీడియా కథనాలను ప్రకారం ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తున్నది. దీంతో బూమ్రా ఆస్ట్రేలియా పర్యటన సమయానికి పూర్తిగా ఫిట్‌గా ఉంటాడు. సహచర ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. తిరిగి జట్టులోకి వచ్చేది ఎప్పుడో అంచనా వేయలేకపోతున్నారు. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ కొంతమంది కొత్త వాళ్లను టెస్ట్ సిరీస్ లో తీసుకోవాలని భాసిస్తున్నది. భవిష్యత్తులో వారిని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టూర్లకు కూడా అందుబాటులో ఉంచుకోవచ్చని భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌పై టెస్టు జాబితాలో వీరికి అవకాశం కల్పించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బుమ్రా స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బాల్ బౌలర్లను పరిశీలిస్తే సెలెక్టర్లు అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ పేర్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. రెగ్యులర్ గా టీ20 క్రికెట్ ఆడుతున్న అర్ష్‌దీప్ కు టెస్టు జట్టు తలుపులు తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత టెస్టు క్రికెట్ ఆడాలనే కోరికను కూడా అర్ష్దీప్ సింగ్ వ్యక్తం చేశాడు. మరోవైపు ఖలీల్ మెరుగైన బౌలర్ అయినా, అతని బౌలింగ్ లో నిలకడ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌కు మరో ఎంపిక యష్ దయాల్. అయితే దయాల్ ప్రస్తుతం ఖలీల్, అర్ష్‌దీప్‌లకు గట్టీ పోటీ ఇవ్వలేకపోతున్నాడు.