Guntur Kaaram : ఓటీటీ లో ‘గుంటూరు కారం’ కి బంపర్ రెస్పాన్స్..ఒక్క గంటలోనే అన్ని వ్యూస్ వచ్చాయా!
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ‘భరత్ అనే నేను’ సినిమా నుండి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న మహేష్ స్పీడ్ కి ఈ సినిమా పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగ నిల్చింది.
మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ మాత్రమే కాదు, మామూలు ఆడియన్స్ కూడా ఎంతో థ్రిల్ కి గురి అవుతారు. ఎందుకంటే ఆ కాంబినేషన్ లో తెరకెక్కిన క్లాసిక్స్ అలాంటివి మరీ. అలాంటి కాంబినేషన్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా కొత్త రకంగా ఉండాలని కోరుకుంటారు, కానీ రొటీన్ కమర్షియల్ సినిమాలాగా అనిపించడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ కి ముందు నుండే హైప్ లేదు.
దానికి తగ్గట్టు టాక్ కూడా బాగలేకపోవడం తో ఈ సినిమాకి మొదటి రోజు నుండే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సంక్రాంతి పండుగ సెలవులు కారణంగా, మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ కారణంగా ఈ సినిమాకి డీసెంట్ స్థాయి వసూళ్లు ఆంధ్ర ప్రాంతం వరకు వచ్చాయి కానీ, నైజాం, ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలలో 50 శాతం కంటే ఎక్కువ నష్టాలు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాని నిన్న అర్థరాత్రి 12 గంటల నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చెయ్యడం మొదలు పెట్టారు. దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్లాప్ సినిమా అయ్యినప్పటికీ అది సూపర్ స్టార్ కదా, ఎంతైనా ఆ మాత్రం క్రేజ్ కచ్చితంగా ఉంటుంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లోకి అప్లోడ్ చేసిన గంట వ్యవధిలోనే దాదాపుగా 600 లక్షల యూనిక్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాని చూడని వాళ్ళు కూడా నిన్న నెట్ ఫ్లిక్స్ లో చూసారు. చూసిన ప్రతీ ఒక్కరు చెప్పేది ఏమిటంటే ఈ సినిమాని అసలు ఎలా ఫ్లాప్ చేసారు. ఇంత పర్ఫెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాని అందించిన ఫ్లాప్ చేస్తున్నారే, అసలు మీకు ఎలాంటి సినిమాలు కావాలి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.