Infosys : ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు అదిరిపోయే ప్యాకేజీని ఆఫర్ చేసింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఏర్పాటు చేసిన డెవలప్మెంట్ సెంటర్ లో పనిచేసేందుకు ముందుకొస్తే రూ. 8 లక్షల వరకు శాలరీ ఇస్తామని పేర్కొంది. అందుకోసం ఉద్యోగులకు ఇటీవలే ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించింది. ప్రాజెక్టు డెవలప్ మెంట్ విధల్లో ఉన్న బ్యాండ్-2 ఆపై స్థాయిలో ఉన్న ఉద్యోగులకు బదిలీ ప్రోత్సాహకాలు అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. ఇండియాలో ఏ డెవలప్ మెంట్ సెంటర్ నుంచిైనా ఉద్యోగులు ఇక్కడికి రావొచ్చని తెలిపింది. ఇక బ్యాండ్-3, అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు బదిలీ సమయంలో రూ.25 వేలు ఇస్తామని చెప్పింది. అనంతరం ప్రతీ ఆరు నెలలకు రూ.25 వేల చొప్పున రెండేళ్ల పాటు ఇస్తామని తెలిపింది. మొత్తంగా వీళ్లు రూ.1.25 లక్షల ప్రోత్సాహకాలు అందుకోనున్నారు.
బ్యాండ్-4 ఉద్యోగులకు రూ.2.5 లక్షలు, బ్యాండ్-5 రూ.5 లక్షలు, బ్యాండ్-6 స్థాయి ఉద్యోగులకు రూ.8 లక్షల ప్రోత్సాహకాలు అందస్తామని తెలిపింది. అయితే, కర్ణాటకలో హుబ్బళ్లి టైర్-2 సిటీగా ఉంది. వాస్తవానికి ఇక్కడ పనిచేసేందుకు ఎవరు ఆసక్తి చూపక పోవడంతో కంపెనీ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా ముంబై-కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.