Bullet Bhaskar Says Rashmi Girlfriend : రష్మీని తన గర్ల్ ఫ్రెండ్ అంటూ చెప్పిన బుల్లెట్ భాస్కర్..!

Bullet Bhaskar Says Rashmi Girlfriend
Bullet Bhaskar Says Rashmi Girlfriend : ఈ నడుమ బుల్లితెరపై కూడా సస్పెన్స్ లు తీసుకొస్తున్నారు. ఏదో ఒక స్టంట్ చేసి బుల్లితెర ప్రోగ్రామ్ లు టీఆర్పీని పెంచుకోవాలని కుతూహల పడుతున్నాయి. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా జబర్దస్త్ లో ఇలాంటి పనులు చాలా కామన్ అయిపోతున్నాయి.
ఇందులో ఆయన చేసిన కామెంట్లు జబర్దస్త్ వరకే కాకుండా అంతటా అగ్గి రాజేస్తున్నాయి. బుల్లితెరపై రష్మీ-సుధీర్ అంటే అందరికంటే ఎక్కువ పాపులర్ అయిన జంట అనే టాక్ ఉంది. అందులో డౌట్లు లేవంతే. రష్మీ సినిమాలతో పాటు జబర్దస్త్ లో చేస్తూ కాలం గడిపేస్తోంది. అటు సుధీర్ కూడా అంతే. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేసి బిజి బిజీగా నటిస్తూ రిలీజ్ చేస్తున్నాడు.
అయితే తాజాగా బుల్లెట్ భాస్కర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో మీకు లవ్ స్టోరీస్ గట్రా ఏమైనా ఉందా అని యాంకర్ ఓ కొంటె ప్రశ్న అడిగేసింది. దానికి మనోడు రెచ్చిపోయి ఏకంగా యాంకర్ రష్మీని తన గర్ల్ ఫ్రెండ్ అంటూ దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు. దాంతో అక్కడున్న యాంకర్ తో పాటు అందరూ ఓ నిముషం షాక్ అయ్యారు.
అక్కడే ఉన్న జబర్దస్త్ జడ్జిలు కృష్ణ భగవాన్, ఖుష్బూ సైతం కాసేపు నివ్వెర పోయారు. యాంకర్ రష్మీ కూడా ఆ కామెంట్లకు కాస్త కంగారు పడింది. మరి ఈ కామెంట్లు వైరల్ కాకుండా ఉండవు కదా. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే.. ఈ కామెంట్లు కాస్తా ఎక్స్ ట్రా జబర్దస్త్ లోని స్కిట్ లో చేసినవి. ఈ ప్రోమో ఇప్పుడు దుమారం రేపుతుందని కొందరు కామెంట్లు పెడుతున్నారు.