Mumbai : ముంబైలో భారీ వర్షాలకు కూలిన భవనం.. ఇద్దరి మృతి

Mumbai
Mumbai : ముంభైలో భారీ వర్షాల కారణంగా ఓ భవనం కూలి ఇద్దరు మృతిచెందారు. ముంభై గ్రాంటు రోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉదయం 10.30 గంటలకు భారీ వర్షాల కారణంగా శనివారం ఓ భవనంలోని ఒక భాగం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భవనంలోని ఒక భాగం పూర్తిగా కూలింది. మరికొంత భాగం ప్రమాదకరంగా వేలాడుతూ ఉంది. ఇప్పటివరకు అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
గత కొద్ది రోజులుగా ముంబైలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ నీటితో చెరువులుగా మారాయి. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.