Interim Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సాధారణంగా బడ్జెట్ కోసం అందరూ వేచిచూసేది వేటి ధరలు తగ్గుతాయి..వేటి ధరలు పెరుగుతాయనే. అయితే ఈసారి బడ్జెట్ లో వేటి ధరలు తగ్గాయే..వేటి ధరలు పెరిగాయే చూద్దాం..
తాజా బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా పలు కీలక అంశాలను వెల్లడించారు. అయితే పన్నులు, కొత్త కొత్త స్కీమ్స్, రాయితీలు వంటివి మాత్రం ఏమీ లేవు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వపు తాజా బడ్జెట్ లో ధరలు పెరిగేవి? తగ్గేవి? అనే అంశానికి సంబంధించి కూడా ఎలాంటి ముఖ్యమైన ప్రకటనలు లేవు. ఎందుకంటే ఇది మధ్యంతర బడ్జెట్ . లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడే వరకు మాత్రమే మధ్యంతర బడ్జెట్ ను తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రభుత్వం ఆర్థిక అవసరాలను చూసుకుంటుంది. ఎన్నికల తర్వాత ఏర్పాటు అయ్యే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడుతుంది.
అందుకే ఈ మధ్యంతర బడ్జెట్ లో ధరలు పెరిగేవి, తగ్గేవి అంటూ ఏమీ ఉండవు. ఇది అందరికీ నిరాశ కలిగించేదే. అయితే ప్రభుత్వం మాత్రం మధ్యతరగతికి, హెల్త్ వర్కర్లకు, యువతకు ఈ బడ్జెట్ లో కాస్త ఊరట కలిగే ప్రకటనలను మాత్రం చేసింది. మహిళల కోసం ల్యాక్ దీదీ స్కీమ్ విస్తరణ, ఎంట్రపెన్యూర్లకు వడ్డీ లేని రుణాలు, టూరిజం డెవలప్ మెంట్ కు వడ్డీ లేని రుణాలు, 2 కోట్లకు పైగా ఇల్ల నిర్మాణం..ఇలా పలు కీలక ప్రకటనలు చేసింది.
అయితే నిర్మలా ప్రసంగం గమనిస్తే.. కార్లు, స్మార్ట్ ఫోన్లు, టీవీలు, అనేక ఇతర వస్తువులపై కస్టమ్ డ్యూటీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్పత్తుల తయారీకి అవసరమైన కొన్ని భాగాల దిగుమతులపై సెస్, పన్నులను తగ్గిస్తున్నట్లు తెలిపారు. అలాగే సిగరెట్లపై పన్నులను 16శాతం పెంచుతున్నట్లు చెప్పారు. అంటే వాటి ధర మరింత పెరుగనుంది. బంగారం, ప్లాటినమ్ తో తయారు చేసిన వస్తువులకు ధర పెరిగింది. సిల్వర్ డోర్లు, బార్ లు, ఆర్టికల్స్, కాపర్ స్క్రాప్, కాంపౌండ్ రబ్బర్ మరింత ప్రియం కానున్నాయి.