Megastar Chiranjeevi : మెగాస్టార్లు ఊరికే అవ్వరు, ఎంతో కష్టం, కసి, పట్టుదల ఉంటేనే అవుతారు అనడానికి ఉదాహరణ మన మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన సొంత కష్టం తో అంచలంచలుగా ఎదుగుతూ ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకుంటూ వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకొని మెగాస్టార్ గా ఎదిగాడు.
నాలుగు దశాబ్దాలుగా నెంబర్ 1 హీరో స్థానం లో ఏకఛత్రాధిపత్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వయస్సు 70 ఏళ్లకు అతి చేరువలో ఉంది. కెరీర్ ప్రారంభం లో ఎలా అయితే కష్టపడేవాడో, ఇప్పటికీ కూడా అదే రేంజ్ లో కష్టపడుతున్నాడు. ఈ వయస్సులో ఆయన సినిమాల్లో చెయ్యాల్సిన అవసరమే లేదు. సంతోషం గా ఇంట్లో కూర్చొని మానవరాళ్ళతో ఆదుకోవాల్సిన వయస్సు. కుటుంబం లో ఉన్న అందరూ పాన్ వరల్డ్ స్టార్ హీరోలే. అయినప్పటికీ కూడా వాళ్ళతో పోటీ పడే మానసిక ఉల్లాసం మెగాస్టార్ కి మాత్రమే సొంతం.
గత ఏడాది ఆయన ‘భోళా శంకర్’ చిత్రం తో అభిమానులను బాగా నిరాశపరిచాడు. అందుకే ఈ ఈసారి కొడితే కుంభస్థలం బద్దలయ్యే ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు. ‘బింభిసారా’ మూవీ డైరెక్టర్ వసిష్ఠ తో ఆయన ‘విశ్వంభర’ అనే ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం సుమారు 250 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ వీడియో క్వాలిటీ చూడగానే ప్రతీ ఒక్కరు ఇది కదా మెగాస్టార్ రేంజ్ సినిమా అంటే, అనవసరం గా రీమేక్ సినిమాలు చేసి బ్రాండ్ ఇమేజి కి దెబ్బపడేలా చేసుకున్నాడు , ఇక మెగాస్టార్ కి తిరుగులేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ షెడ్యూల్ కి సిద్ధం అవుతున్నట్టు మెగాస్టార్ నేడు తన ట్విట్టర్ ఖాతాలో జిమ్ వర్కౌట్స్ చేసిన వీడియో ని అప్లోడ్ చేసాడు. కుర్ర హీరోలు కూడా ఈ రేంజ్ లో కష్టపడరు ఏమో అని మెగాస్టార్ ని ఈ వీడియో చూసినప్పుడు అర్థం అవుతుంది.
Gearing up .. And raring to go #Vishwambhara pic.twitter.com/VeUj0yhN35
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2024