JAISW News Telugu

Budget 2024 : మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్..కొత్త హౌసింగ్ స్కీం, కోటి ఇండ్లకు ఉచిత విద్యుత్ ..

good news for middle class

good news for middle class

Budget 2024 : మధ్యతరగతి జీవులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీం తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర మంత్రి ఇవాళ రూ.47.66లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. వివిధ మార్గాల ద్వారా రూ.30.80 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

ఇందులో బస్తీలు, అద్దె ఇండ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆమె పేర్కొన్నారు. అలాగే పీఎం అవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ‘పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్’ కరోనా కాలంలోనూ కొనసాగిందని నిర్మలా చెప్పారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. మొత్తం 2 కోట్ల ఇండ్లను నిర్మించనున్నట్లు వివరించారు.

అలాగే విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్ లో నూతన పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300క యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్ టాప్ సోలారైజేషన్ స్కీంను తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ.15 వేల నుంచి రూ.18వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. కాగా, ఈ పథకం గురించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.

Exit mobile version