Buchi Babu : రామ్ చరణ్ మూవీ కోసం బుచ్చిబాబు కథ తయారు చేయడానికి ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా

Buchi Babu, Janhvi Kapoor and Ramcharan
Director Buchi Babu : రామ్ చరణ్ మూవీ కోసం దర్శకుడు బుచ్చిబాబు చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. రామ్ చరణ్ క్యారెక్టర్ ని ఒక రేంజ్ లో చూపించేందుకు కథ బలంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. దీనికోసం మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రచయితల ద్వారా రామ్ చరణ్ క్యారెక్టర్ ని పూర్తి బలంగా ఒక డిఫరెంట్ గా కనిపించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
రామ్ చరణ్ ఇప్పటికే రంగస్థలం మూవీ ద్వారా చెవిటి వ్యక్తిగా నటించి తన సత్తా నిరూపించుకున్నాడు. ఈ క్యారెక్టర్ చేయడానికి ఆయన ఒప్పుకోవడం ఒక సక్సెస్ అయితే అందులో లీనమై ప్రతి ప్రేక్షకుడిని అలరించాడు. ఆ తర్వాత రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాలో నటనకు సినీ ప్రేక్షక లోకం ప్రశంసలు కురిపించింది. ఏకంగా హాలీవుడ్ డైరెక్టర్ టైటానిక్ అవతార్ లాంటి సినిమాలను సృష్టించిన జేమ్స్ కామర్స్ సైతం రామ్ చరణ్ నటనను మెచ్చుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంచరణ్ మరో లెవల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఇటు బుచ్చిబాబు దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ గా ఉండబోతుందని దీనిపై తెలుగు ప్రేక్షకులు తెగ అంచనాలు పెంచుకున్నారు. రామ్ చరణ్ తో పాటు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా ఈ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే జాన్వి దేవర చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
కాగా అటు చిరంజీవి కోరిక కూడా శ్రీదేవి కూతురు రామ్ చరణ్ తో నటిస్తే చూడాలని ఉందని గతంలో ఒక వేదిక పైన ప్రకటించారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టించింది. అలాంటి మరో చరిత్ర సృష్టించే సినిమా రామ్ చరణ్ , జాన్వి కపూర్ లో కలయికతో రానుందని అందరూ అనుకుంటున్నారు. దీనిని బుచ్చిబాబు నిజం చేస్తారని తెలుగు ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారు.