Tamil Nadu : తమిళనాడు బీఎస్పీ చీఫ్ దారుణ హత్య

Tamil Nadu BSP Chief Armstrong
Tamil Nadu : తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి చెన్నై పెరంబూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడిచేసి చంపారు. ఈ దాడిలో ఆర్మ్ స్ట్రాంగ్ వెంట ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దాడి జరిగిర వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఆర్మ్ స్ట్రాంగ్ ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని సెంబియమ్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గెటప్ లో వచ్చిన దుండగులు పార్టీ కార్యకర్తలPతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.