JAISW News Telugu

BSNL : బీఎస్ఎన్‌ఎల్.. సిమ్ లేకుండానే కాల్స్, మెసేజ్ లు అందించబోతున్నదా?  

BSNL

BSNL

BSNL : భారత ప్రభుత్వ ఆధీనంలోని బీఎస్ఎన్ ఇటీవల కొత్త లోగోను విడుదల చేసింది. దీనితో కొత్త నినాదాన్ని అందుకోవడంతో పాటు ఏడు కొత్త సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ అధునాతన సాంకేతికతతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని అధిగమించడానికి సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటున్నది. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్  మరో కొత్త సేవను అందించేందుకు పలు ప్రయోగాలు చేస్తున్నది. సిమ్ కార్డు లేకుండా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను అందించేందుకు ప్రయత్నాలను చేస్తున్నది.

‘డైరెక్ట్ టు డివైజ్’
‘డైరెక్ట్ టు డివైస్’ ద్వారా ఈ కనెక్టివిటీ సర్వీస్‌లో, బీఎస్ ఎన్ ఎల్ ఎలాంటి అవాంతరాలు లేని, కచ్చితమైన  కనెక్టివిటీని అందించడానికి శాటిలైట్,  టెరెస్ట్రియల్ మొబైల్ నెట్‌వర్క్‌లను ఒకచోట చేర్చుతున్నట్లు తెలుస్తున్నది. . ఈ సేవ వయాసాట్(viasat) సహకారంతో అభివృద్ధి చేస్తున్నది. కంపెనీ ఇటీవల ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌కు హాజరైన వారి మధ్య ఉపగ్రహ ఆధారిత సందేశ సేవను ప్రదర్శించింది.

శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్
ట్రయల్‌లో కంపెనీ వాణిజ్య ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించింది. ఇందులో నాన్ టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ (ఎన్‌టిఎన్) కనెక్టివిటీతో, దాదాపు 36,000 కి.మీ దూరంలో ఉన్న వయాసాట్ ఉపగ్రహానికి సందేశం పంపింది. ఐఫోన్,  ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో శాటిలైట్ మెసేజింగ్ లాగా, డైరెక్ట్ టు డివైజ్ ద్వారా భూమి, గాలి, సముద్రంలో పని చేసేలా, అత్యవసర లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఉపయోగించుకునేలా సేవలను తీసుకురాబోతున్నది.

డైరెక్ట్ టు డివైజ్ ద్వారా ఇప్పటికే ఉన్న సెల్యులార్ నెట్‌వర్క్‌లను తీసుకొని వాటితో కొత్త ఉపగ్రహ నక్షత్ర రాశులతో పరస్పర చర్యతో పని చేస్తాయి. ఇవి ఆకాశంలో పెద్ద సెల్ టవర్‌లుగా ఉపయోగపడుతాయి. కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని కవరేజీ అంతరాయాన్ని తగ్గించవచ్చు.

ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు కూడా శాటిలైట్ కనెక్టివిటీ సేవలపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఈ విభాగంలో బీఎస్ఎన్ఎల్ ప్రవేశించి ముందుగానే ఆయా కంపెనీలకు సవాల్ విసురుతున్నది.

Exit mobile version