Reverse aging : వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేందుకు రివర్స్ ఏజింగ్ థెరపీ చేయించుకున్న బిలియనీర్ బ్రయాన్

Reverse aging
Reverse aging : బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని జయిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనేది అతని కోరిక. ప్రస్తుతం అతని వయస్సు 47 సంవత్సరాలు. అతను తన టీనేజ్ పిల్లల వయస్సును చేరుకోవాలనుకున్నాడు. దీని కోసం అతను మాట్లాడడమే కాకుండా ప్రతి సంవత్సరం రెండు మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. మన కరెన్సీలో 17 కోట్ల రూపాయలకు సమానం. వైద్య ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు. ఈసారి అతను తన రక్తం నుండి ఒక లీటరు ప్లాస్మాను తీసేశాడు. బదులుగా అతను ఒక లీటర్ అల్బుమిన్ను ఎక్కించాడు.
ఇది తన రక్తంలో వృద్ధాప్యానికి కారణమయ్యే అన్ని కారకాలను తొలగిస్తుందని ఆయన పేర్కొన్నాడు. దీంతో రక్తంలో ఉండే టాక్సిన్లన్నీ కూడా తొలగిపోతాయి. బహుశా ఒక లీటరు ప్లాస్మాకు బదులుగా అల్బుమిన్ను ఎక్కించిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి అతడే కావచ్చని చెబుతున్నారు. కానీ దాని వల్ల అన్ని ప్రయోజనాలు ఉంటాయా లేదా ఏదైనా దుష్ప్రభావాలు ఉండవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది.