KCR : ఏం కోల్పోయార్ తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. సిద్దిపేటలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమై మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు. సమాజాన్నినిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతుందని మండిపడ్డారు. ప్రజలు బాధ్యత ఇస్తే, అంతే బరువుతో సేవ చేయాలని మాజీ సీఎం అన్నారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువే చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేసీఆర్ సమక్షంలో సినీ నిర్మాత శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.