BRS VS Congress : బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ.. వికారాబాద్ మర్పల్లిలో ఉద్రిక్తత

BRS VS Congress
BRS VS Congress : వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మర్పల్లిలోని మంగళవారం బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసు పెట్టారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పార్టీ శ్రేణులతో కలిసి మార్పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా స్టేషన్ వద్దకు తరలివచ్చారు. ఆనంద్ డౌన్.. డౌన్.. మార్పల్లి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆగడాలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.