BRS VS Congress : తన ఫిరాయింపులే తనకు గండంగా మారాయా?

BRS VS Congress

BRS VS Congress

BRS VS Congress : ప్రజలు నాయకులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఎవరికి ఏ స్థానం ఇస్తే బాగుంటుందో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనుకోవచ్చు. ఒకరికి పాలక బాధ్యతలు అప్పగిస్తే మరొకరికి ప్రతిపక్షం బాధ్యతలు అప్పగిస్తారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న వారిని సైతం ప్రలోభాలకు గురి చేసి పాలక పక్షంలో కలుపుకుంటే ప్రజలు నిరస చెందుతారు. అచ్చం కేసీఆర్ అలానే చేశారు.

తను పాలు పోసిన పెంచిన పాము త‌న‌నే కాటేసిన‌ట్లు.. తను అల‌వాటు చేసిన ఫిరాయింపులు త‌న మెడ‌కే చుట్టుకుంటున్నాయి. 2014, 2018 ఎన్నిక‌ల త‌ర్వాత ఏ పార్టీలో గెలిచినా.. అంతా గులాబీ గూటికే అన్నట్లుగా మారింది. అప్పడు బీఆర్ఎస్ అలా వ్యవహరిస్తే ఇప్పుడు కాంగ్రెస్ మరోలా బదులు తీర్చుకుంటుంది.

ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రెండు రోజుల క్రితం ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరిపోయారు. ఇలా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా కాంగ్రెస్ లో చేరుతారోనని గులాబీ క్యాడ‌ర్ లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ స‌మావేశాలు ప్రారంభమయ్యాయి. కౌన్సిల్ లో కాంగ్రెస్ కు బ‌లం లేకపోవడంతో జీహెచ్ఎంసీలో అనుస‌రించాల్సి వ్యూహాల‌పై గ్రేట‌ర్ కౌన్సిల‌ర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి 10 మంది కార్పొరేటర్లు స‌హ ప‌లువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

త‌ల‌సాని పార్టీ మారుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ వైర‌ల్ అయ్యింది. కానీ త‌ల‌సాని అధ్యక్షతనే ఈ గ్రేట‌ర్ మీటింగ్ జరిగింది. ఎమ్మెల్యేలు బండారి ల‌క్ష్మారెడ్డి, వివేకానంద‌, మాధ‌వ‌రం కృష్ణారావు, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి, అరికెపూడి గాంధీ ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారు. మాములుగా అయితే ఇలాంటి సమావేశాలను కేటీఆర్ నిర్వహిస్తారు. కానీ, కేటీఆర్ ఢిల్లీలో ఉండడంతో బాధ్యతలను తలసాని తలకు ఎత్తుకున్నాడు. 

TAGS