KTR:రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ పార్టీ స్వేద పత్రాన్ని విడుదల చేస్తున్నవ ఇషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పవర్‌ప్రజెంటేషర్ ద్వారా స్వేద పత్రాన్ని విడుదల చేస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల దాన్ని ఆదివారానికి వాయిదా వేశారు.
ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వేద పత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇంతకీ ఇందులో ఎలాంటి అంశాలు, లెక్కలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్రాన్నిబీఆర్ఎస్ 6 వేల కోట్ల మేర అప్పుల మయం చేసిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న వేళ కేటీఆర్ ఆ విమర్శలని స్వేద పత్రంతో ఎలా తిప్పికొట్టబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా `తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం..దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం పగలూ రాత్రి తేడా లేకుండా..రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. అందుకే గణాంకాలతో సహా..వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించడానికే స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నానంటూ కేటీఆర్ వెల్లడించడం తెలిసిందే.