KTR:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరంటే ఒకరు ఒంటికాలిపై లేస్తున్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే..బీఆర్ఎస్ మాత్రం చేసిన అభివృద్దిని చూపించకుండా అప్పులను మాత్రమే చూపిస్తున్నారని, ఆస్తులని, చేసిన అభివృద్ధిని దాస్తున్నారని మండిపడుతోంది. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది.
ఇటీవల తెలంగాణ అప్పులపై ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఇందులో మొత్తం 6 వేల కోట్లకు పైనే అప్పులు చేశారని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. అయితే ఇది కరెక్ట్ కాదని, తాము చేసిన అభివృద్దిని చూపించకుండా అంతా తప్పుల తడకగా శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అంతే కాకుండా కేటీఆర్ శనివారం తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ శ్వేతపత్రానికి కౌంటర్‌గా `స్వేదపత్రం` పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు.
దీంతో శ్వేతపత్రం వర్సెస్ స్వేదపత్రంగా మారింది. `తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి తేడా లేకుండా..రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం..అందుకే గణాంకాలతో సహా..వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..అప్పులు కాదు..తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు.. తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీన (శనివారం)ఉదయం 11 గంటలకు
“ స్వేద పత్రం ” పవర్ పాయింట్ ప్రెజెంటేషన్` అంటూ కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. అయితే చివరి నిమిషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ కేటీఆర్ `స్వేదపత్రం` పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాయిదా పడింది.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంపగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే…
— KTR (@KTRBRS) December 22, 2023