BRS Social Media : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ దానిదే ఆధిపత్యం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి సోషల్ మీడియానే ప్రధాన కారణమనే అభిప్రాయం బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. అందుకే తాము ఓటమి చెందామని చెబుతోంది. తిలా పాపం తలా పిడికెడు అనే ఉధ్దేశంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ తప్పిదాలే ముంచాయని తెలుసుకున్నారు. కానీ వారి అహంకారం కూడా ఒక కారణమనే విషయం చాలా మందికి తెలియదు. వారి అహంకార పూరిత మాటలే వారి గెలుపును దూరం చేశాయనే విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్, బీజేపీలు పెట్టిన పోస్టులతోనే తమకు అపజయం కలిగిందని భావిస్తున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గతంలో చేసిన తప్పు చేయొద్దని అనుకుంటున్నారు. సోషల్ మీడియా గ్రూపులను యాక్టివ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని కోసమే సోషల్ మీడియా కోసం ప్రత్యేక వ్యక్తులను నియమిస్తున్నారు. ప్రత్యర్థులు వేసే కౌంటర్లకు సమాధానాలు చెప్పాలని చూస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సభ్యుల విజయం కోసం సోషల్ మీడియాను వినియోగించుకోవాలని భావిస్తోంది. సోషల్ మీడియా వేదికగా వచ్చే ఎన్నికలను ఎదుర్కొని గతంలో చేసిన తప్పులను చేయకుండా చూడాలని ఆశిస్తోంది. ఇందుకోసం పటిష్ట యంత్రాంగాన్ని నియమించుకుంటోంది. బీఆర్ఎస్ తన తప్పు తెలుసుకుని మళ్లీ చేయకూడదని నమ్ముతోంది.