Unexpected Shock to BRS : తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి ఎదురీతను ఎదుర్కొంటున్నది. ఇదే స్వయంగా అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ముచ్చెముటలు పోయిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తు న కాంగ్రెస్ లోకి చేరికలు జరిగిపోయాయి. ఇక ఖమ్మంలో ఇప్పటికే ఆ పార్టీ ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. కీలక నేతలు పొంగులేటి, తుమ్మల లాంటి నేతలు ఇప్పటికే కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రయత్నిస్తున్నారు.
ఇక తాజాగా ఖమ్మం డిప్యూటీ మేయర్ ఫాతిమా బీఆర్ఎస్కు రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఆమె వెంట భర్త ముక్తార్ సుడా డైరెక్టర్గా, నగర మైనార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఇద్దరూ తుమ్మల సమక్షంలో ఫాతిమా దంపతులు కాంగ్రెస్ లో చేరారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని మైనార్టీ నేతలు నమ్ముతున్నారని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అయితే అధికార బీఆర్ఎస్ కు ప్రత్యా్మ్నాయం కాంగ్రెస్సే అనే ఆలోచన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని, ఇక కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని తుమ్మల చెప్పుకొచ్చారు.
అయితే రాష్ర్ట వ్యాప్తంగా ఇవే పవనాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బలంగా పోటీ ఇస్తున్నది. ఈ క్రమంలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి, గువ్వల బాలరాజులపై దాడి అంటూ కాంగ్రెస్ పై ఆరోపణలు చేయబోయి. బొక్కబోర్లా పడింది కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడిలో ఎలాంటి కక్ష రాజకీయాలు లేవని నేరుగా సీపీనే ప్రకటించింది. ఇక గువ్వల బాలరాజు పై దాడి కూడా సొంత పార్టీ వారేననే అభిప్రాయం వినిపిస్తున్నది. మరోవైపు నిరుద్యోగులు కూడా నేరుగా బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో యువత ఓట్లు నమ్ముకున్నట్లు కనిపించడం లేదు. అయితే పింఛన్లు అందుకున్న వారు, రైతు బంధు లబ్ధిదారులే ఇప్పుడు బీఆర్ఎస్ కు కీలకంగా మారారు. అయితే వారు కూడా ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ప్రశ్న. ఇక బీఆర్ఎస్ పరిస్థితి అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్నట్లుగా పరిస్థితి ఉంది.