JAISW News Telugu

BRS : మహారాష్ట్ర వైపు మచ్చుకైనా చూడని బీఆర్ఎస్.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారా?

BRS in maharashtra

BRS : అతి విశ్వాసం (ఓవర్ కాన్ఫిడెన్స్) ప్రమాదకరం అని పెద్దలు ఊరికే అనలేదు. ఏదో ఒక చోట తనకు సాగిందని అంతటా సాగుతుందనుకోవడం పొరబాటే.. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచింది. తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభం.. టీఆర్ఎస్ ఏర్పాటు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొక్కిపెట్టడం.. వైఎస్ మరణం తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడడం అన్నీ తెలంగాణ ప్రజలకు తెలిసినవే.. అయితే, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. అది ఏంటంటే.. ఉద్యమం వేళలలో వచ్చిన టీఆర్ఎస్ అన్నీ తానై నడిపినట్లు చెప్పి.. తామే తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటూ ఒక సారి గద్దెనెక్కింది.

ఇంత వరుక బాగానే ఉంది. ఇక ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. రెండో సారి కూడా సీఎం పీఠం దక్కడంతో సహజంగానే పార్టీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. దీంతో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ పేరు కాస్తా బీఆర్ఎస్ గా మారింది. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లి ఏదో పొడిచేద్దాం అనుకున్నారు పార్టీ అధినేత కేసీఆర్. అక్కడ ఏదో ఒక కార్పొరేషన్ లో ఒక సీటు సంపాదించారు. దీంతో తాము దేశంలో తిరుగులేని శక్తి అవుతామని కలలు కన్నాడు. మహారాష్ట్ర, తెలంగాణలో కలిసి 50 ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని కలలు కన్నాడు. కానీ తెలంగాణలో ఓటిమితో చతికిల పడ్డాడు. ఇక మహారాష్ట్ర వైపునకు చూసేందుకు తీరిక లేకుండా పోయింది.

గతంలో స్థానిక రాజకీయాలను మరిచి మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. అక్కడి జవాన్ల, కిసాన్ల కుటుంబాలకు తాయిళాలు ఇచ్చారు. వీటి కోసం కొందరు బీఆర్ఎస్ లో చేరారు. మరింత ఉత్సాహంగా బహిరంగ సభలు, నాగపూర్ లో ఓ పార్టీ ఆఫీస్ కూడా పెట్టారు. 50 సీట్లు కోసం గ్రాఫులు, అంచనాలు, మ్యాపులు వేశారు.

ఇప్పుడు కథ రివర్స్ అయ్యింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఊసుకు అందరూ మరిచారు. చేరికల ప్రసక్తే లేకుండా పోయింది. ఇక బీఆర్ఎస్ నేతలు మహారాష్ట్ర వైపునకు పోవడం లేదు. చివరకు పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఆశలను కొట్టేసుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతుంది. మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ రానుంది. కానీ ఈ సారి 20 రోజుల ముందుగానే వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఫిబ్రవరిలోనే రావచ్చు. ఇంకా గట్టిగా 40 రోజులు కూడా కావడం లేదు. ఇప్పుటి ప్రణాళికల ప్రకారం చూస్తే.. మహారాష్ట్రను వదిలేసినట్లే అనుకోవచ్చు.

Exit mobile version