BRS Nazar on Sitakka : సీతక్క పైనే బీఆర్ఎస్ నజర్.. ఓడగొట్టేందుకు విశ్వప్రయత్నాలు
BRS Nazar on Sitakka : రాష్ర్టంలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లేడీ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సీతక్క. తనదైన కార్యక్రమాలతో ఆకట్టుకుంటుంటారు. ములుగు నియోజకవర్గం నుంచి ఆమె ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఎట్టి పరిస్థితిల్లో ఆమెను ఓడించాలని బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇక సీతక్కలాగే మావోయిస్టు నేపథ్యం ఉన్న బడే నాగజ్యోతికి ఈ టికెట్ ఇఛ్చారు. అయితే మొత్తం ములుగు పార్టీ ఆఫీస్ నుంచే పూర్తి మానిటరింగ్ జరుగుతున్నది.
ములుగు పూర్తిగా ఏజెన్సీ నియోజకవర్గం. అంతా గిరిజనులే. ఇక ఇక్కడ బీఆర్ఎస్ ను గెలిపించేందుకు పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటు మరికొందరు ములుగులోనే మకాం వేశారు. అయితే సీతక్కకు గిరిజనుల్లో మంచి పేరుంది. ఇప్పుడు ఆమెను ఒడగొట్టేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు మరి ఫలిస్తాయో లేదో చూడాలి.
ఇక సీతక్క అంటే గిరిజనులకు పూర్తి అభిమానం. ఇక కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి కావొచ్చనే అభిప్రాయం కూడా ఆమెపై ఉంది. సీతక్క ముందుగానే తాను బీఆర్ఎస్ లా డబ్బులు పంచలేనని, అయితే డబ్బులు పంచిన వారు తరువాత మనవైపు చూడరని చెబుతున్నది. అయితే సీతక్కకు ఉన్న అభిమానం, ఈ డబ్బుల ముందు గెలుస్తుందో లేదో వేచి చూడాలి. ఏదేమైనా మరోసారి సీతక్కకే ములుగు ప్రజలు అవకాశం ఇస్తారని రాష్ర్ట వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతున్నది. కాంగ్రెస్ లో ముందుగా ఎలాంటి ఎదురు లేకుండా గెలిచే ఎమ్మెల్యే ఒక్క సీతక్క మాత్రమేననే అభిప్రాయం వినిపిస్తున్నది.