MLC Kavitha : జూన్ 3 వరకు కవిత రిమాండ్ పొడిగింపు
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో అధికారులు తాజాగా కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
2024 మార్చి 15న హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను అరెస్టు, అదేరోజు రాత్రి ఢిల్లీకి తరలించారు. మార్చి 16న కవితను ట్రయల్ కోర్టులో ప్రొడ్యూసర్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో కవితను కింగ్ పిన్ గా
ఈడీ వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. దీంతో రెండు దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అనంతరం మార్చి 26న కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
కవిత తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న (రంజాన్) కవితను సీబీఐ అరెస్టు చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా.. కోర్టు సీబీఐ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఈరోజు (సోమవారంతో) ముగిసింది. దీంతో అధికారులు తాజాగా కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.