MP Anil Yadav : రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ బయటపడిన ప్రతిసారి బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. రాజ్ పాకాల, విజయ మద్దూరుని వెనకేసుకు రావడానికి కేటీఆర్ కు సిగ్గు ఉండాలన్నారు. గత ప్రభుత్వం డ్రగ్స్ కేసుని ఏ విధంగా దారి మళ్లించిందో ప్రజలకు తెలుసన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే వివాదాలకు కేంద్రం. ఒకసారి దీపావళి ఫెస్టివల్, ఇంకోసారి గృహ ప్రవేశం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగానను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తుంటే.. వాళ్లు డ్రగ్స్ ను ప్రేరేపించాలని చూస్తున్నారని అనిల్ యాదవ్ మండిపడ్డారు.