BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి.. కేసీఆర్ కు షాక్ తప్పదా..
BRS : కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వనుంది. పోలింగ్ 13వ తేదీన జరగనుండగా.. ఆ లోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటోంది. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు చేరతారు. ఎమ్మెల్సీ ఎవరనే విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక పంపించిందట.. అధిష్టానం నుంచి ఆదేశాలు రాగానే వెంటనే కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందంట.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కు షాక్ ఇవ్వనున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఒకరిద్దరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాస్త ఆలోచనలో పడిందంటా.. ఎన్నికల ముందు వీరిని పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లోకి ఏమైనా నెగిటివిటీ వస్తుందా.. అనే అంశాలను పరిశీలిస్తుందని ఒక వేళ చేరికలు ఇప్పుడే జరిగితే ఎంపీ ఎన్నికలకు ఇబ్బంది కలిగితే ఏంటనీ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం.
తాజాగా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎవరనే దానిపైనే చర్చ నడుస్తోంది. గ్రేటర్ లో ఇప్పటికే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. దానం నాగేందర్ పోటీ చేయడం వల్ల మల్కాజిగిరిలో రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కు గట్టి పోటీ ఎదురవుతోంది.
ఇప్పటికే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ నుంచి కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్సీలు, గ్రేటర్ లో ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్ వీరిని కాంగ్రెస్ లోకి వెళ్లకుండా నిలువరించగలుగుతాడా.. లేక ఎప్పటిలాగే కొత్త తరాన్ని తయారు చేస్తాం.. ఉంటే ఉండండి పోతే పోండని అంటారా చూడాలి. ఏమైనా పదేళ్లుగా రాష్ట్రాన్ని శాసించిన కేసీఆర్ ను లెక్కచేయకుండా పార్టీలు మారుతున్నారంటే ఆయన ప్రభావం తగ్గిందని ఒప్పుకోకతప్పదు.